Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు
నవతెలంగాణ-శంకర్పల్లి
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. విధులకు సిబ్బంది సక్రమంగా హాజరవుతున్నారా లేదా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండ మండల కేంద్రంలోని మెగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. మెగా ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది వీధుల పట్ల అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ప్రయివేట్ ఆస్పత్రిలో అబార్షన్లు చేసినట్టు తెలిస్తే ఆ ఆస్పత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆయనతోపాటు డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్, వైద్యాధికారి రేవతి, గోపాల్ రెడ్డి, సుదర్శన్ మన్సూర్ దితరులు పాల్గొన్నారు.