Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కంటి-వెలుగు కార్యక్రమంతో పేదలకు వెలుగు లని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి అన్నారు. కందుకూరు మండల్ కొలను గూడా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆదర్ల గీతేశ్వరి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం కంటి-వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయో గపడుతుందన్నారు. మానవుని శరీరంలో అన్ని అవయ వాల కంటే కంటికి ప్రాధన్యత ఎక్కువ ఉందనీ, కండ్లు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతామన్నారు. కండ్ల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం వహించ కుండా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియో గించుకోవాలని సూచించారు. కంటి వైద్యులు కండ్లను పరీక్షించి, కండ్ల అద్దాలు, మందులు అందజేస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగిం చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ బండ విజయలక్ష్మీ ప్రభుత్వ వైద్యులు, బీఆర్ఎస్ నాయకులు తాళ్ల కార్తీక్, కొలను విగేశ్వర రెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, బొక్క దీక్షిత్ రెడ్డి ఆనె గౌని పాండు, జి. సామయ్య, మహేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఆదర్ల వెంకటేష్, బండ రాజు, నజు రుద్దీన్, ఏఎన్ఎం అలివేలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.