Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్ట్టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్టు చైర్మెన్ మూడే రవి
నవతెలంగాణ-శంకర్పల్లి
పదో తరగతి విద్యార్థులు పది శాతం ఉత్తీర్ణత సాధించాలని హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మూడే రవి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని పదోవ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత కె. హైమవతి ఏఏఓ శాఖ, వారి సహకారంతో ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్ష జరుగుతున్నందున, వారికీ ఎగ్జామ్ కిట్స్, ఎగ్జామ్ ప్యాడ్, జామెంట్రీ బాక్స్, లాంగ్ స్కేల్, పెన్ను, పెన్సిల్, షాప్నర్, ఎరేజర్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు మణికంఠ, మొగు లయ్య, అనుపమ, రాజా, జ్యోతి, వరలక్ష్మి పాల్గొన్నారు.