Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.రాములయ్య
- ఆమనగల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్థంతి
నవతెలంగాణ-ఆమనగల్
భగత్ సింగ్ జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శం గా తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.రాము లయ్య అన్నారు. గురువారం ఆమనగల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 92వ వర్థంతి ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ జిల్లా నాయకులు రాములయ్య హాజరై మాట్లాడారు. షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉపొంగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కాన్గుల వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ళ శివశంకర్, కేవీపీఎస్ నాయకులు తొగరి పోచయ్య, సీఐటీయూ మండల నాయకులు లాలూనాయక్, హంసమ్మ తదితరులు పాల్గొన్నారు.