Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ
- ఆమనగల్లో బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమం త్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఆమనగల్ పట్టణంలోని నారాయణ సాగర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్ర మంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి రమణ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అం దుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎడ్మ కిష్టారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు అనురాధ పత్య నాయక్, జర్పుల దశరథ్ నాయక్, విజితారెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలా పురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు జక్కు అనంత్‌రెడ్డి, ఆనంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్‌రావు, నేనావత్ పత్య నాయక్, కుమ్మరి శంకర్, రైతు సమన్వయ కమిటీ జిల్లా నాయకులు బాచిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, జోగు వీరయ్య, కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, ఎంపీటీసీ లు బొప్పిడి గోపాల్, దోనాదుల కుమార్, సర్పంచ్‌లు సోనా శ్రీను నాయక్, సులోచన సాయిలు, కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.