Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినం దనీయం అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి మండల పరిధిలోని మాదారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెబియా, మదున పంతుల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిరణ్ రూ.15 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ సాప్ట్వేర్ కంపెనీ అధినేత, స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పాఠశాల పక్కనే భూమి కొనుగోలు చేసి పాఠశాల స్థితిని మార్చాలనుకున్న సంకల్పం చాలా గొప్పదన్ని కొనియాడారు. ప్రభుత్వ పాఠ శాలను అభివద్ది చేస్తూ పేద విద్యార్థులను విద్యాపరంగా ప్రొత్సహించడం అభినందనీయమన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మధున పంతుల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ పాఠశాల నిధుల లేమితో మధ్యలో ఆగిపోయిందన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ బోయిని రాములు తన దృష్టికి తీసుకువచ్చాడన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేయాలన్న సంకల్పంతో రూ.15 లక్షలు వెచ్చించి పాఠశాల భవనం పూర్తి చేయించామన్నారు. ఇందుకు జెబియా, మధున పంతుల ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం చేశామన్నా రు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట య్య మాట్లాడుతూ పాఠశాల భవనంతోపాటు విద్యార్థులు 25 డెస్క్ బేంచీలు, పాఠశాలకు ఫ్యాన్లు తదితర సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ కరణం అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రి యప్రవీణ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, నెదర్లండ్ నుంచి జెబియా ప్రతినిధులు ఆర్యన్, మధుర్, భార్గవ్, మధున పంతుల ఫౌండేషన్ కార్యదర్శి చలపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, ఎంఈఓ హరిశ్చందర్, నాయకులు బేతు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పొల్కంపల్లి సర్పంచ్ ముదుసూధన్రెడ్డి, మాదారం మాజీ సర్పంచ్ గోపాల్, ఈశ్వరప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.