Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.8లక్షలతో సీసీరోడ్డు పనులను జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునీత గోపాల్, వార్డు సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మయ్య, గ్రామ పెద్దలు యాస విట్టల్‌రెడ్డి, దండు వెంకటయ్య, మల్లారెడ్డి, చంద్రయ్య, గాండ్ల మల్లేశం, బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.