Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పంచాయత్ అవార్డుల ప్రదాన ఉత్సవ కార్య క్రమం నిర్వహించారు. మండలంలో 37 గ్రామ పం చాయతీలకుగాను 27 గ్రామపంచాయతీ సర్పం చులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సర్పంచు లను, గ్రామపంచాయతీ కార్యదర్శులను ఎమ్మెల్యే సన్మానించి, అవార్డులను ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాకు రెండు, మూడు అవా ర్డులు వచ్చేవన్నారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్య క్రమాన్ని తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశా రని తెలిపారు. గతంలో గ్రామాలకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపక నిధులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్య క్రమా లతో గ్రామాల రూపురేఖలే మారి పోయాయని తెలి పారు. గతంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీలో నీ టి సమస్య, కరెంటు సమస్య ఎక్కు వగా ఉండేది, కా నీ నేడు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తూ, సీఎం కేసీఆర్ కరెంటు సమస్య లే కుండా చేశాడని కొనియాడారు. పరిగి మం డలం నుండి మూడు గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అవార్డులు కూడా వచ్చాయని తెలిపారు. సర్పం చులు,సెక్రటరీలు బాధ్యతగా పనిచేయడం వల్లే 27 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయ న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ రావు, జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, వైస్ ఎంపీపీ కావలి సత్యనా రాయణ, రైతుబంధు అధ్యక్షుడు రాజేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.