Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలాధ్యక్షులకు, ఎంపీటీసీకి కనీస సమాచారం లేకుండా ప్రొసీడింగ్స్
- ఎంపీటీసీగా విజయ ఆంజనేయులు
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
దోమ మండలాధ్యక్షుల అనుమతి, స్థానిక ఎంపీటీసీకి సమాచారం లేకుండా పనులు చేస్తున్న సంఘటన మండల పరిధిలోని అయినాపూర్ గ్రామ పంచాయితీలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళితే అయినాపూర్ ఎంపీటీసీగా విధులు నిర్వ హిస్తున్న విజయ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జ యరాం పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధంగా మం డల పరిషత్ అధ్యక్షులు అనుమతి గాని ఎంపీటీసీకి సమాచారం లేకుండా పనులు చేస్తున్నాడు. గ్రామాల్లో దాతల ద్వారా వేసిన పాత బోర్లకు అధ్య క్షుల అనుమతి లేకుండా తన ఇష్టారాజ్యంగా మంజూరు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఎంపీటీ సీల, హక్కులను గౌరవాన్ని కాల రాస్తున్నారని అన్నారు. ఉన్నత అధికారులు స్పందించి దోమ ఎంపీడీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకో వాలని కోరారు. ఎంపీ టీసీల హక్కులకు, గౌరవాన్ని కాపాడుకొ నేందకుకు ఎంతటి పోరాటానికైనా తాము సిద్దమని అయినాపూర్ ఎంపీటీసీ విజయ ఆంజ నేయులు తెలిపారు.