Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు
- మండల కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరణ
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యు.బుగ్గప్ప
నవతెలంగాణ-యాలాల
సీసీఐ(ఎం) జనచైతన్య యాత్రను జయప్రదం చేయా లని యాలల మండల సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యు.బుగ్గప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేం ద్రంలో ఆయన జనచైతన్య యాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్య తిరేకంగా, సంక్షేమం మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సా మాజిక న్యాయం కోసం పోరాడుదామనే నినాదంతో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేం ద్రంలో అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల తర్వాత ప్రధాని మో దీ, హౌంమంత్రి అమిత్‌షాల నేతృత్వంలో కార్పొరేట్ కం పెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మో పుతూ రూ.23 కోట్ల మందిని పేదలను చేశారన్నారు. దేశ మంటే అంబానీ, ఆదానీల, సొత్తుగా మార్చేశారన్నారు. ధర ల పెరుగుదల వల్ల కార్పొరేట్లు వేల కోట్ల రూపాయల లా భాలను పోగేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సామా న్య, మధ్యతరగతి, ప్రజానీకం మాత్రం ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనేక కుయు క్తులు ప్రదర్శిస్తూ మళ్లీ ఎన్నికల్లో గెలిచి లబ్దిపొందాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులతో పాటు హేతువాదులు, అంబెద్కరిస్టులు, అభ్యుదయ వాదులపై తీవ్ర దాడిని బీజేపీ కొనసాగిస్తుందన్నారు. వీటికి వ్యతిరేకం గా పోరాడుతూనే మతసామరస్యాన్ని కాపాడుకునేందుకు కృషి జరుగుతుందని జన చైతన్య యాత్ర కొనసాగుతుం దని ఆయన తెలిపారు. జనచైతన్య యాత్ర మార్చి 24 శుక్రవారం ప్రారంభమై కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిల మీ దుగా 26న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వికారా బాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వికారాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిం చనున్నట్లు తెలిపారు. సభకు కార్మికులు, కర్షకులు, ప్రజానీ కం అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ(ఎం) తరఫున విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రమేష్, రాములు, సాయి రాం, శివకుమార్, లాలప్ప మోహన్, తదితరులున్నారు.