Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భీం రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
జర్నలిస్టులపై దాడులు చేయడం అక్రమ కేసులు పె ట్టడం పత్రికా స్వేచ్ఛను అణచివేయడం తెలంగాణ ప్రభు త్వం తీరు సరైనది కాదని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, మండలాధ్యక్షులు బీఎస్ ఆంజనేయులు ముది రాజ్ బ్లాక్ బి అధ్యక్షులు కర్రే భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...ప్రజల గొంతు కైన తీన్మార్ మల్లన్నపైన మిగతా జర్నలిస్టుల పైన దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు తెలుపుతున్న జర్నలిస్టు మిత్రులను అక్రమ కేసులు పెట్టి హింసించడం మానుకోవాలన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీ టీసీ ఆనందం, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మో త్కూర్ వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు నాగిని ఎల్లయ్య, బోయిని కృష్ణయ్య, తమ్మలి రామచంద్రయ్య, ఘనపూర్ గ్రామకమిటీ అధ్యక్షులు భరత్‌కుమార్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కొమ్ము శ్రీనివాస్, తదితరులున్నారు.