Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మనఊరు-మనబడి' ఇన్చార్జీ ఏఈ రాఘవేందర్ని విధుల నుంచి తొలగించాలి
- రాస్తారోకో, నిరసన
నవతెలంగాణ-కుల్కచర్ల
'మన ఊరు-మన బడి' పనుల నిర్వాహణలో జాప్యం చేస్తున్న ఏఈని సస్పెండ్ చేయాలంటూ శుక్రవారం కుల్క చర్ల మండల కేంద్రంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి నాయకులు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు స్థాని క బీజేపీ నాయకులు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపా రు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ 'మన ఊరు-మన బడి' పథకం ద్వారా ఎం పికైన పాఠశాలల్లో పనులు నత్తనడకన కొనసాగుతున్నా యని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాప్యానికి కారణమైన ఏఈ రాఘవేందర్ను విధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన మౌళిక వసతులు కల్పించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన 'మనఊరు-మనబడి కార్యక్రమం ఇలాంటి అధికారుల వల్ల నిరుగారి పోతుందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబం ధిత ఏఈపై చర్యలు తీసుకోవాలని ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభించి విద్యార్థులకు వాడుకలోకి వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షు లు గాదె మైపాల్, గిరిజన మోర్చా జిల్లా నాయకులు గోవిం ద్ నాయక్ పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి మండల శాఖ అధ్యక్షులు సౌర్ల హరికృష్ణ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయికిరణ్గౌడ్ బీజేవైఎం మండలాధ్యక్షుడు గడుసు మహిపాల్, గోపాల్, కృష్ణ, మహేష్, ముకుంద, రవి, వెంకటేష్, ఆంజనేయులు, మొగులయ్య, రాజు, ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు.