Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ వసంత వెంకట్
నవతెలంగాణ-కోట్పల్లి
అధికారులు సమయపాలన పాటించి అభివృద్ధి పను లను సక్రమంగా కొనసాగించాలని మోమిన్పేట్ ఎంపీపీ వసంత వెంకట్ అన్నారు. శుక్రవారం మోమిన్పేట్ మం డల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రా మాల సర్పంచులు ఎంపీటీసీలు పలు అంశాలను సభా దృష్టికి తీసుకొవచ్చారు. అనంతరం ఎంపీపీ వసంత వెంక ట్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వ హించాలని అధికారులకు తెలిపారు. ఎన్ఆర్ఈజీ ఎస్ కింద గ్రామాల్లో వేస్తున్న సీసీరోడ్లను త్వరగా పూర్తి చేయా లని పెండింగ్ ఉంచకూడదని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా వాటిని పూర్తి చేసేందుకు ప్రజలకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైల జా రెడ్డి, ఎంపీఓ యాదగిరి, ఐసిఐడిఎస్ అధికారిని, ఇజా ర చిట్టెంపల్లి సర్పంచ్ కాశీరాంనాయక్, సైదల్లిపూర్ సర్పం చ్ సత్యనారాయణరెడ్డి, అంజయ్య, ఏపీఎం రాజు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, అధికారులు నాయ కులు తదితరులు పాల్గొన్నారు.