Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి
- సొసైటీ సర్వసభ సమావేశంలో చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
రైతులు దీర్ఘకాలిక రుణాలను చెల్లిస్తే సొసైటీ అభివృ ద్ధి లాభాల్లో ముందుకు సాగు తుందని రైతు సేవా సహకా ర సంఘం చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు నివేదిక క్లస్టర్ కార్యాలయంలో రైతు సేవా సహకార సంఘం 44వ సర్వసభ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించే విధంగా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని రైతులు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ విష్ణు వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..బ్యాంకు మారడం పట్ల, పూర్తిస్థాయి సిబ్బంది లేక, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నా రని మూడేండ్ల నుండి ఎన్నిసార్లు చెప్పినా ఎస్బీఐ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నా రని మండిపడ్డారు. బ్యాంక్ అధికారులు తీరు మార్చుకోక పోతే, డీసీసీ బ్యాంక్‌కు రైతు సేవ సహకార సంఘాన్ని లీనం చేస్తామని హెచ్చరించారు.11 కోట్ల నుండి 14 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు కృషి చేయాలన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకా లంలో చెల్లించాలని సూచించారు. రూ.50 వేల లోపు ఉన్న 323 మంది, రైతులకు గాను 232 మంది రైతులకు రూ.87 లక్షల 64 వేలు రుణమాఫీ వర్తించిందని, ఇంకా 91 మందికి రుణమాఫీ రావాల్సి ఉందన్నారు. లక్ష లోపు ఉన్న 1087 మంది రైతులకు గాను రూ.9 కోట్ల 27 లక్షల 6 వేల రుణమాఫీ రావాల్సిందన్నారు. 2022-2023 లో సొసైటీలో దాదాపు 1950 అకౌంట్లు రెన్యువల్స్ కావాల్సి ఉండగా, 320 మంది సభ్యులు మాత్రమే అప్పు కట్టి రుణాలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దశలవారీగా రుణమాఫీ చేస్తుందని సూచించా రు. కార్యక్రమంలో మేనే జింగ్ డైరెక్టర్ మల్లికార్జున్, సొసై టీ డైరెక్టర్ మంబాపూర్ నారాయణరెడ్డి, పద్మమ్మ, సుగుణ మ్మ, గేమ్య, వెంకటప్ప, మాజీ సర్పంచులు కిషన్‌రావు, ప్రకాశం, మేనేజర్ ముల్డిగౌడ్, సొసైటీ సిబ్బంది ఫయాజ్, ప్రవీణ్ కుమార్, పెంటప్ప, రైతులు తదితరులన్నారు.