Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరేంకల నర్సింహా
- ఏప్రిల్ 3న చలో ఢిల్లీ కార్యక్రమం
నవతెలంగాణ-మంచాల
మత్స్యకారులు హక్కులను తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్ విధానాలను తిప్పి కొట్టాలని టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన మత్స్యకారుల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్య కారులకు బడ్జెట్ కేటాయింపులో వివక్షతన్న విధానంపై దేశ వ్యాప్తంగా మత్స్య కారులు సమస్యలు పరిష్కరించాలని ఏప్రిల్ 3 ఢిల్లీలో జంగర్ మంతర్ సమీపంలో భారీ ఎత్తున మత్స్య కారుల మహాధర్నా నిర్వహిస్తుందన్నారు.ఈ ధర్నాలో మత్స్య కారులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్య కార్యక్తల సమావేశంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ చేపట్టినట్టు తెలిపారు.2023 లో మత్స్య కారులకు కేవలం రూ.6 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాలయలు కేటాయించాని , 50 ఏండ్లు నిండిన మత్స్య కారులకు ఫించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎన్సీడీసీ ద్వారా మత్స్యకారులకు మోటార్ సైకిళ్లు ఇవ్వాలనీ, చేపల మార్కెట్లు నిర్మించాలని కోరారు.ఈ వృతిలో ప్రమాదావ శాత్తు మృతి చెందితే ఇన్సురెన్స్ ఇవ్వాలని, ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3న ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాకు మత్స్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లింగంపల్లి ప్రభాకర్, ఆరుట్ల సొసైటీ అధ్యక్షులు తవిటి యాదగిరి, జపాల సొసైటీ అధ్యక్షులు యాట భిక్షపతి ,జీలమొనీ శ్రీనివాస్ ,నీలం యాదయ్య,ఎలామూని యాద గిరి తదితరులు ఉన్నారు.