Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని షాబాద్, మొయినాబాద్ మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అధిక సంఖ్యలో ఆయన స్వగృహానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్న బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి, ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతానికి పార్టీ నాయకులు కార్య కర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ షాబాద్ మండల అధ్యక్షులు కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, వెంకటరెడ్డి, గుండాల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట రాజు గౌడ్, మొయినాబాద్ పీఎసీఎస్ చైర్మెన్ చంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మోత్కుపల్లి రాములు, నవపేట్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, మొయినాబాద్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, రాఘవరెడ్డి, చంద్రారెడ్డి, నరసింహారెడ్డి ,అజిత్ నగర్ వెంకట్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు రవీందర్ నాయక్, ఆర్ శేఖర్, రఘు, అశోక్, ఆంజనేయులు, చేవెళ్ల స్వామి, యాదగిరి, గోపాల్, వరప్రసాద్, వెంకటేష్, సత్యం గౌడ్, అమ్జాద్, మంగళ శేఖర్, రవి, కుమార్ షాబాద్, మొయినాబాద్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.