Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్మత్ సర్పంచ్ నౌసు ప్రవీణ్ కుమార్
- మత్తు పానియలకు దూరంగా ఉండాలి
- ఎన్ఎస్ఎస్ క్యాంప్ సిటీ కాలేజీ విద్యార్థులు
నవతెలంగాణ-మంచాల
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అస్మత్పూర్ సర్పంచ్ నౌసు ప్రవీణ్ కుమార్ విద్యార్థులు అన్నారు. సోమవారం మండల పరిధిలోని అస్మత్ గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ సిటీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలతో పాటు, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఎన్ఎస్ఎస్ క్యాంప్ విద్యార్థులు మాట్లాడుతూ గత రెండు రోజులు ఆరుట్ల గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించినట్టు తెలిపారు. అస్మత్పూర్ గ్రామంలో 180 మంది విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించి, పర్యావరణపై ,మూడు నమ్మకాల నిర్మూలించేందుకు ప్రజలకు అవగాహన కల్పించి, ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగప్ప, ప్రోగ్రాం అధికారులు కె.నాగరాజు, జయకాగడా, చంద్రకీర్తి, తిరుపతి, సుదక్షణ మీడియా కమిటీ సభ్యులు ఈర మ్మ, చతుర్వేద్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.