Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్ పట్ట ణంలో సోమవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, పట్టణ అధ్యక్షుడు నేనావత్ పత్య నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. ఏప్రిల్ 3న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమనగల్ పర్యాటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్ఠీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పది వేలకు తగ్గకుండా జనాన్ని సమీకరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈసమావేశంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్యనాయక్, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, సర్పంచ్ సోనా శ్రీను నాయక్, ఎంపీటీసీలు సరిత పంతు నాయక్, దోనాదుల కుమార్, కౌన్సిలర్లు కమటం రాధమ్మ వెంకటయ్య, సోనా జైరామ్ నాయక్, సీనియర్ నాయకులు తల్లోజు రామకృష్ణ, అప్పం శ్రీను, చుక్క నిరంజన్‌గౌడ్, సయ్యద్ ఖలీల్, వస్పుల సాయిలు, గుత్తి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.