Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల నిర్వహణ అస్తవ్యస్తం
- తీవ్రంగా వేధిస్తున్న వైద్యులు, మందుల కొరత
- సమయపాలన పాటించని సిబ్బంది
- పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యం
- ప్రకటనలకే పరిమితమైన మంత్రి హరీష్‌రావు హామీలు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. సిబ్బంది కొరత, మందుల లేమితో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలు వెనుదిరగాల్సి వస్తోంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆలోచన బాగునప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో బస్తీ దవాఖానాల లక్ష్యం నెరవేరడం లేదు.
నవతెలంగాణ-రాజేంద్రనగర్
బస్తీ దవాఖానాల్లో వైద్యులు కొరత
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని చాలా బస్తీ దవాఖానాల్లో వైద్యులు లేకపోవడంతో ప్రజలు దవాఖానా కు రావడం లేదు. ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రతి దవాఖా నాలో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్ నర్స్, ఒక సహాయకురాలు ఉండాలి. అయితే కొన్నిట్లో వైద్యుడు ఉంటే స్టాఫ్‌నర్స్ ఉం డరు, స్టాఫ్‌నర్స్ ఉంటే వైద్యుడు లేని పరిస్థితి ఉంది. మైలా ర్దవ్పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్లో మూడు నెలలుగా దవాఖానాలో వైద్యులు లేరు. డివిజన్ పరిధిలో ఎక్కువగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. అనా రోగ్యానికి గురైతే వీరు స్థానికంగా ఉన్న దవాఖానాకు వెళ్లేవా రు ఇప్పుడు అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రయివేట్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆప్కో కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి బస్తీ దవాఖా నాల్లో వైద్యులు ఉన్న వారు సకాలంలో రావడం లేదు. దవా ఖానాలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వై ద్యుల పనితీరు మెరుగుపడుతుందని స్థానికులు వాపోతున్నారు.
వైద్య పరీక్షలు లేవు
బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్ష వైద్య పరీక్షలు ఉచి తంగా చేస్తున్నామని లిక్విడ్, థైరాయిడ్ టెస్ట్‌లు కూడా ఇం దులో ఉన్నాయని వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటిం చారు. అదేవిధంగా మార్చి నెల చివరి వారం నుంచి 134 టెస్టులు ఉచితంగా చేస్తామని, అందుకోసం టెండర్లు పిలి చామని మంత్రి తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో వైద్య పరీ క్షలు చేయడం లేదు. బ్లడ్ షాంపూల్స్ స్వీకరించడానికి స్టాఫ్ నర్స్ కూడా అందుబాటులో లేరు. మార్కండేయనగర్ దవా ఖానాలో స్టాఫ్‌నర్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నిరాశగా తిరిగి వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వ హించిన రిపోర్ట్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.
మందుల కొరత
బస్తీ దవాఖానాల్లో మందుల కొరత చాలా తీవ్రంగా ఉంది. జ్వరం, జలుబు మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యాంటీబయాటిక్స్ లేవని వైద్య సిబ్బంది తెలి పారు. రోగులకు చిట్టి రాసి ఇచ్చి బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఆస్పత్రుల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న పట్టించుకునే నాధుడే లేడు. వైద్యులు ఎప్పుడొస్తున్నా రు. ఎప్పుడు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు ఆస్పత్రులను పర్యవేక్షించి బస్తి దవాఖా నాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, ప్రజలు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యులను నియమించాలి
మా మార్కండేయనగర్ బస్తీ దవాఖానాలో మూడు నెలల నుం చి వైద్యులు లేరు. మా ప్రాంతాల్లో ఎ క్కువగా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు నివా సిస్తున్నారు. వారు ప్ర యివేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చే యించుకో లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బస్తీ దవాఖా నాలో వైద్యులు అందుబాటులో ఇవ్వకపో వడం బాధా కరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వైద్యు లను నియమిం చాలి.
- వీడెం రమేష్, మార్కండేయనగర్ కాలనీ అధ్యక్షుడు
వైద్య పరీక్షలు నిర్వహించాలి
రాజేంద్రనగర్ నియోజ కవర్గం పరిధిలోని ఏ బస్తీ ద వాఖానాలో వైద్య పరీక్షలు సరి గ్గా చే యడం లేదు. ప్రభుత్వం 57 రకాల వైద్య పరీక్షలు ఉచి తంగా చేస్తున్నామని గొప్పగా చెప్పుకుం టున్న క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్య పరీక్షలు నిర్వహించాలి.
- చేడం వెంకటరమణ గుప్తా, బాబుల్ రెడ్డినగర్
సమస్యలను పరిష్కరిస్తా
కొన్ని బస్తీ దవాఖనాల్లో వైద్యులు లేరు. ఇటీవలే ఖా ళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వేశాం. కానీ ఎవరూ రాలేరు. త్వరలో ఖాళీలను భర్తీ చేస్తాం. అదేవిధంగా బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్క డైనా పరీక్షలు నిర్వహించకుంటే అక్కడి సిబ్బందిపై చర్యలు తీసు కుంటాం. మందుల కొరత లేకుండా చూస్తాం.
- వినోద్, బస్తీ దవాఖనాల ప్రోగ్రాం ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా