Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- అగ్నికి ఆహుతైన కుర్చీల లోడుతో ఉన్న డీసీఎం
నవతెలంగాణ-శంషాబాద్
నడుస్తున్న వాహనం లోకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయిన ఘటన శంషాబాద్ ఆర్జిఐఏ పోలీ స్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన డీసీఎం లారీ రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి పరిధిలోని గగన్పహా డ్ పారిశ్రామిక వాడలో ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో కుర్చీల ను లోడ్ చేసుకొని అక్కడి నుంచి చెన్నైకి వెళ్తున్నది. కం పెనీ నుంచి నేషనల్ హైవే 44 పైకి రాగానే డీసీఎం క్యా బిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గ మనించిన డ్రైవర్ వెంటనే కిందికిదిగి డీసీఎంలో ఉన్న నీట ితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. మంటలు అదుపులోకి రాకుండా ఎగిసిపడటంతో డీసీఎంతో పాటు అందులోని ప్లాస్టిక్ కుర్చీలు సైతం అగ్నికి అహుతయ్యా యి. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చే రుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.