Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి
- మెతరి శ్రీకాంత్ ఆశయ సాధనకు కృషి చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్
- దండుమైలారంలో శ్రీకాంత్ వర్థంతి సభ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. సామేల్ అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో కామ్రేడ్ మేతరి శ్రీకాంత్ వర్థంతి సభను సీపీఐ (ఎం) గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శ్రీకాంత్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు... శ్రీకాంత్ మృతి అత్యంత బాధాకరమని అన్నారు. శ్రీకాంత్ చిన్న వయసులోనే ఎర్రజెండా భుజాన వేసుకొని ప్రజానాట్యమండలి ఆట, పాటల్లో పాల్గొని ప్రజానాట్య మండలికే వన్నెతెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. సీపీఐ(ఎం) పోరాటాల్లో, కార్యక్రమంలో శ్రీకాంత్ ముం దుండేవాడని గుర్తు చేశారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. అనేక ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యా పారుల్లో అన్యాక్రాంతం అతున్నాయని, వాటిని వెంటనే ఇం డ్లు లేని పేదలకు పంచాలన్నారు. శ్రీకాంత్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీకాంత్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి జంగయ్య, రైతు సంఘం అధ్యక్షులు ముసలయ్య, వెంకటేష్, గ్రామశాఖ అధ్యక్షులు లింగం, పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి గణేష్, సీపీఐ(ఎం)నాయకులు కాకి రమేష్, తింక యాదగిరి, గుడ్డెటి జంగయ్య, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.