Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల హామీలను అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి కృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్
నవతెలంగాణ-తాండూరు
తాండూరులో కొనసాగుతున్న బీఆర్ఎస్ గ్రూప్ తగాదాలతో తాండూరు నియోజక వర్గంతో పాటు మున్సి పల్కు తీరని నష్టం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళి కృష్ణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం బీజేపీ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాండూరు గోస-బీజేపీ భరోసా కార్యక్రమం పేరుతో మున్సిపల్ సమస్యలపై ఒక రోజు నిరసన దీక్ష నిర్వహిం చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాం డూర్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. మున్సిపల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత బంటారం లావణ్య, బీజేపీ నాయకులు మనోహర్‌రావు, పటేల్ విజరు కుమార్,పూజారి పాండు, మోతుకుపల్లి చంద్రశేఖర్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు జహీర్, అబ్బాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రహ్లాదరావు, పట్టణ కార్యదర్శి రామ్‌చందర్, ప్రకాష్, నాయకులు తాండ్ర నరేష్ సంజీవ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.