Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి ఎమ్మెల్యేగా ఆదరించాలి
- సంక్షేమంలో కేసీఆర్‌ను చూడాలి
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
- 95 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 58 జీఓ లభ్దిదారులకు పట్టాలందజేత
నవతెలంగాణ-గండిపేట్
పేదలందరూ కేసీఆర్ సర్కారు అందిస్తున్న పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం గండిపేట్ తహసీల్దా ర్ కార్యాలయంల కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 58 జీఓ కింద దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... కేసీఆర్ సర్కారును భవిష్యత్‌లోనూ ఆదరించాలన్నా రు. ప్రజా సంక్షేమాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నారు. మూడేండ్లలో గండిపేట్‌లో కల్యాణలక్ష్మీ లబ్దిదారులకు రూ.3 కోట్ల వరకు అందజేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను పేదలకు అందజేస్తా మన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు 95, 58 జీఓ 51లబ్దిదారులకు పట్టాలను అందజేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పట్టాలను ఇచ్చేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధ్దంగా ఉందన్నారు. మరోసారి తననుఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.
తహసీల్థార్తో అధికార
పక్ష నాయకుల వాదన
ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిన తరువాత మిగతా చెక్కులను అదించే క్రమంలో కొంతమంది అధికా రపక్ష నాయకులు తహసీల్దార్‌తో వాదనకు దిగారు. నార్సిం గి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీలకు సంబంధించి న గ్రామాల వారీగా ప్రజా ప్రతినిధులు, నాయకులు లభ్దిదా రులకు చెక్కులిచ్చేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో కొంత మంది అధికార పక్ష నాయకులు తహసీల్దార్ రాజ శేఖర్‌తో వాదనకు దిగారు. లబ్దిదారు రాకపోవడంతో వారి కి సంబంధించిన వారికి చెక్కు ఇచ్చేందుకు ప్రయత్నం చేశా రు. ఈ క్రమంలో చెక్కును తహసీల్దార్ తిరిగి తీసుకోవ డంతో గొడవ జరిగింది. లబ్దిదారులకు ఇవ్వాలని కోరిన తహసీల్దార్ ఇవ్వడం లేదని వట్టినాగులపల్లి నాయకులు ఆరోపించారు. మేయర్, మిగతా బీఆర్ఎస్ నాయకులు సర్ధి చెప్పి చెక్కులను ఇచ్చే ప్రయత్నం చేశారు.
జనంలో కూర్చున్న కాంగ్రెస్ కార్పొరేటర్
గండిపేట్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పట్టించడం లేదు. ఇందుకు నిదర్శనంగా తహ సీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూర్చీ లేకపోవడంలో కాంగ్రెస్ కార్పొరేటర్ జనంలో కూర్చున్నా రు. అధికారులు పిలవకపోయినా ఎమ్మెల్యే వద్ద సభల్లో కూర్చొవడానికి బీఆర్ఎస్ నాయకులు తహతహలాడుతు న్నారు. సభకు ముందు కొంత మంది అధికార పక్ష నాయ కులు కూర్చీలను సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రతిపక్ష ప్రతినిధులకు కూర్చీలు లేకపోవడంతో జనం మధ్యలో కూర్చొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార కార్యక్రమంలో కాంగ్రెస్, మిగత పార్టీలకు చెందిన కార్పొ రేటర్లకు కనీసం కూర్చీలను కేటాయించడం లేదని ఓ కార్పొరేటర్ అవేదన వ్యక్తం చేశారు. అధికార కార్యక్రమాల్లో అధికారులు, అధికారపక్ష నాయకులు ప్రొటోకాల్ పాటించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ జంగయ్య, ఆర్ఐలు ఉదరుకుమార్, మహిపాల్‌రెడ్డి, ఛైర్పర్సన్ రేఖాయాదగిరి, మేయర్ మహేం దర్‌గౌడ్, బండ్లగూడ బీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్‌గౌడ్, గం డిపేట్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా. మాజీ ఎం పీపీ తలారి మల్లేష్, ప్లోర్‌లీడర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు శివారెడ్డి, ఉషారాణి, నాగపూర్ణ, విజేత, పత్తి ప్రవీణ్‌కు మార్, పత్తి శ్రీకాంత్, అమరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, డైరెక్టర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.