Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
అర్హులైన ప్రతి ఒక్కరూ డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా ఇల్లులేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం పథ కం ద్వారా ఇండ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీ సుకువచ్చారని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర వార్డ్ ఆఫీసర్లకు దరఖాస్తు ఫారంలో అందజేయాలని సూచించారు. ఈ నెల 28వ తేదీ నుండి 3 ఏప్రిల్ వరకు దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, కౌన్సిలర్లు ఎదుర క్రిష్ణ, రవి, రవీంద్ర, నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఆంజనేయులు,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.