Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్లోని దూబే కాలనీలోని అభి నవ్ బ్యాంక్వెట్ హాల్లో మంగళవారం సీఎం కేసీఆర్ ఆదే శాల మేరకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నా గేందర్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్లోని బీఆర్ఎస్ కా ర్యకర్తల ఆత్మీయసమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాం ధీ, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ హాజరై వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలు పే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచిం చారు. డివిజన్లతో పోలిస్తే శేరిలింగంపల్లి డివిజన్‌కు అత్యధికంగ రూ.317.57 కోట్ల పై చిలుకు ప్రభుత్వం తరుపున ఖర్చు పెట్టి అభివృద్ధి పథంలో ఉంచామని తెలి పారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశంగౌడ్, మా జీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్స్, బస్తీఅధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్స్, బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు, మహిళా నాయకులు, బీ ఆర్ఎస్ అనుబంధ సంఘకాలనీ అసోసియేషన్ ప్రతిని ధులు, బీఆర్ఎస్, కార్యకర్తలు పాల్గొన్నారు.