Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్మకన్నా సొసైటీ చైర్మన్ రవీందర్ గౌడ్
నవతెలంగాణ-తాండూరు రూరల్
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిం చాలని ఎల్మకన్నా పీఎసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్ అన్నారు మంగళవారం సంఘం సాధారణ సర్వేసభ్య సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. చైర్మన్ రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ..రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చె ల్లించినట్లయితే వడ్డీ మాఫీతో పాటు రైతులకు అధిక మొ త్తంలో లోన్పొందే వెసులుబాటు లభిస్తుందన్నారు. జిల్లా లో ఈ సంఘం రికవరీ, చెల్లింపుల్లో మూడవ స్థానం లో ఉందని దానిని మరింత మెరుగుపరిచి మొదటి స్థానానికి తీసుకుపోదామన్నారు అందుకోసం ఖాతాదారులు సహక రించాలన్నారు. రైతులకు ఉల్లిగడ్డ నిల్వ చేసుకునేందుకు గోదాములు కావాలని సభ్యులంతా తమ దృష్టికి తీసుకు వ చ్చారని తీర్మానించిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభు త్వం ద్వారా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. ఎకరాకు ఇచ్చే లోన్ల పరిమితిని పెంచాలని విన్నవిం చారని విషయాన్నిపై అధికారులకు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ నరసింహారెడ్డి సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు, రాఘవేందర్, అనంతయ్య గౌడ్సురేందర్రెడ్డి, హనుమంత్‌రెడ్డి, ఫన్నీభారు. బిచ్చప్ప, పెండే నర్సింలు, వెంకట్రాంరెడ్డి, పార్వతమ్మ, బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.