Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
మండల పరిధిలోని చెల్లాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండల అధ్యక్షు లు వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం 'హాత్ సే హా త్ జోడో' యాత్ర ఇంటి ఇంటికి కార్యక్రమం నిర్వహించా రు. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకా లను ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ నిరుద్యోగులకు ఉద్యోగులు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వ ర్గాల అభ్యున్నతి సాధ్యపడుతుందన్నారు. రాబోయే ఎన్నిక ల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్య క్తం చేశారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రాములు, మాజీ సర్పంచ్ శరణయ్య, ఎంపీటీసీ మంజుల దస్తప్ప, సర్పంచ్ రెడ్యానాయక్, భీంరెడ్డి, కోటం రాములు, వీరన్న, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దాసరి రాజ ప్ప, ఉపాధ్యక్షుడు కే.శ్యామప్ప, అల్లపురాం రమేష్, ఎన్. శేఖర్ వార్డ్‌మెంబర్ సుంకరి శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎం.రాఘవేందర్, వాలిగేరి మహిపాల్, కూర్మని కృష్ణ, చింతకాయల మహిపాల్, కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.