Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఎర్రవల్లిలో ఎస్సీ మహి ళా రైతులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో ఔత్సాహిక చేమ, దుంప, మోరంగడ్డ రైతులకు మంగళవారం అ వగాహనాసదస్సును శిక్షణా కార్యక్రమం దుంప విత్తన పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎస్సీసబ్ప్లాన్ కిందమహిళ సాధికారతకు దుంప పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీలో ఎస్సీ మహిళ రైతులకు, రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో చేమగడ్డ (కాలో కేసియా) మొరంగడ్డ ( స్వీట్ పొటాటో) పురోగమనంలో ఉన్నదన్నారు. కార్య క్రమంలో స్థానిక రైతులు, ఉద్యాన అధికారులు, యు.కమల, వైజయంతి, అర్చన, హెచ్ఈఓ నర్సింహారెడ్డి, కూరగాయ పరిశోధన స్ధానం, రాజేంద్రన గర్, ఇతర ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.