Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీ కూడా హౌసిం గ్ బోర్డ్ కాలనీలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరి స్తానని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సమస్యల మీద లక్ష్మి గూడా హౌసిం గ్ బోర్డ్ కాలనీలో కార్పొరేటర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రయినేజ్, సీసీరోడ్లు సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమ స్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఓపెన్ నాలపై స్లాబ్‌ను వేయడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆయన జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. డి విజన్‌లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరుగు తున్నాయని ఆయన స్పష్టంచేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజలకు ఎలాంటి స మస్యలున్నా తన దృష్టికి తీసుకొని వస్తే సమస్యల పరిష్కా రానికి తక్షణంకృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు. కార్య క్రమంలో డివిజన్ అధ్యక్షుడు జనార్ధన్, పాండు, శివ, దా మోదర్, సుబ్బారెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.