Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
దుర్గా నగర్ చౌరస్తా నుంచి మైలార్దేవపల్లి పల్లె చెరు వు వరకు నిర్వహిస్తున్న నాలా పనులు సకాలంలో పూర్తి చేయడానికి స్థానికులు సహకరించాలని రాజేంద్రనగర్ ఎ మ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన నాలా పనులను పర్యవేక్షిం చారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక ఏండ్లుగా దుర్గానగ ర్లో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇటీవల దు ర్గానగర్ చౌరస్తా నుంచి పల్లె చెరువు వరకు రూ.12 కోట్ల తో నాలా నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే రూ.3 కోట్లతో నాలా పనులు కొంతవరకు పూర్తయ్యాయ ని, పనులు పూర్తికావడానికి స్థానికుల సహకారం కచ్చితం గా అవసరమన్నారు. దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలను ఇ బ్బంది పెడుతున్న ఈ సమస్య పరిష్కారానికి అందరూ స హకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎం సీ అధికారులు దత్తు, కిరణ్ స్థానికనాయకులు దేవదాస్ గౌడ్, ప్రేమ్‌గౌడ్, రఘు, ఈశ్వర్ తదితరులున్నారు.