Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ డిమాండ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని వీర్లపల్లిలో పేదల భూముల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటును రెవెన్యూ అధికారులు వెంటనే విర మించుకోవాలని బీఎస్పీ మండలాధ్యక్షుడు పర్వేద శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం వీర్లపల్లిలో బీఎస్పీ మం డలాధ్యక్షుడు పర్వేద శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ సయ్యద్ అ మీర్, మండల ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్లు బాధితులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కులవృత్తులు చేసుకునే చాకలి, మంగలి, తలారి వారికి అప్పట్లో గడ్డి కల్లాలు, పశువుల పా కల కోసం కేటాయించిన భూమి అని వారు తెలిపారు. నిర క్షరాస్యులైన వారు కబ్జాలో ఉన్నారు కానీ వారికి ఎలాంటి కాగితాలూ లేనందువల్ల రెవెన్యూ అధికారులు ఆ స్థలాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు గుర్తించడంతో బాధి తులకు ఇంటి స్థలాలు కూడా లేవని ఆ స్థలాల్లోనే ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని ఉన్న స్థలాలు ప్రభు త్వం గుంజుకుంటే పేదల బతుకులు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాతల తరాల నుంచి ఆ స్థ లాలపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి అదే స్థలంలో ఇంటి స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయా లని క్రీడా ప్రాంగణం కోసం మరో స్థలాన్ని ఎంపిక చేయా లని వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు సూచిం చిన భూమిలో క్రీడా ప్రాంగణం రెవెన్యూ అధికారులు గు ర్తించిన 20 గుంటల భూమిలో గ్రామానికి చెందిన పేదలు కబ్జాలో ఉన్నారని మరో స్థలాన్ని ఎంపిక చేస్తే అక్కడ క్రీడా ప్రాంగణం నిర్మిస్తామని సర్పంచ్ సుధాకర్ రెడ్డి తెలిపారు.