Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రతీ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే ప్ర భుత్వ లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. పస్తుతం మంజూరైన 9 నూతన వైద్య కళాశాల నిర్మాణం పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి స కాలంలో పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ పనుల పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆ రోగ్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత ఇం జనీరింగ్ అధికారులతో మంత్రి హరీష్ రావు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్విలతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త గా మంజూరైన వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులను నిర్వహించుకునే విధంగా జిల్లా కలె క్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. జూలై నుండి ప్రారంభమయ్యే తరగతులకు అనుగుణంగా నిరా ణపు పనులకు సమిష్టిగా కృషి చేసి ప్రారంభిస్తే జిల్లాకు పేరు, ప్రతిష్ట వస్తుందన్నారు. ప్రతిరోజూ నిర్వహించే ప నుల పరిశీలనకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకో వాలని ప్రతీ వారం జిల్లా కలెక్టర్లు చేపట్టిన పనులను పరి శీలిస్తూ ఉండాలని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ వై ద్య కళాశాల పనులను జాతీయ వైద్య కమిషన్ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. వైద్య కళా శాలలో అవసరమైన స్టాఫ్ నియామక ప్రక్రియ నెలన్నర కాలంలో పూర్తి చేస్తామన్నారు. జూలై నుంచి మొదటి వి డత అడ్మిషన్స్ ప్రారంభం అయ్యే నేపథ్యంలో, వైద్య కళా శాలలను సన్నద్ధం చేసి ఎన్ఎంసి నుంచి అనుమతి సా ధించాలని ఆయన తెలిపారు. వైద్య కళాశాలలో చదివే పిల్ల ల కోసం ప్రత్యేకంగా 60 మంది మహిళలు, 40 మంది పురుషులకు సరిపడే విధంగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ భవనాలను సమకూర్చాలన్నారు. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ తరగతి గదుల పనులు పురోగతిలో ఉన్నాయని, ఏప్రిల్ 15 వరకు పూర్తి చేయడం జరుగు తుందన్నారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ని ర్మాణపు పనులను అలాగే వసతి గృహానికి అవసరమైన భవనాలను పరిశీలించామని కలెక్టర్ సహకారంతో సకా లంలో పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా. పాల్వాన్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, టీఎస్ఎం ఎస్ఐడీసీ ఈఈశ్రీనివాసులు, డీఈలు రవీందర్, లక్ష్మీనా రాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.