Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిరోడ్డుపై హత్య ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
- డబ్బుల కోసం హై డ్రామా
- కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-కొడంగల్
మనుషుల్లో మానవత్వం మంటగలు స్తుం ది బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మారుతు న్నాయి. బీమా డబ్బులు కాజేసేందుకు ఓ కిరాతకుడు దా రుణానికి ఒడిగట్టాడు. పెంచిపెద్ద చేసిన కన్న తండ్రిని బీమా డబ్బులు వస్తాయని దురుద్దేశంతో హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. సమాజం తలదించుకోవలసిన ఘటన ఇది. పక్కా ప్రణాళిక ప్రకారం తన అన్న దగ్గరకు వెళ్దామని చెప్పి నమ్మించి బైక్‌పై తీసుకెళ్లి రోడ్డు పక్కకు తీసుకువెళ్లి తల వెనుక భాగాన బండరాయితో కొట్టి చంపి రోడ్డుపై వేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నించాడు. తొలుత ప్రమాదమని భావించిన పోలీసులు తీరా ఘటనా స్థలాన్ని పరిశీలించాక ఇది ముమ్మాటికి హత్యేనన్న నిర్ధారణకు వచ్చారు. కొడుకుపై అను మానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇదంతా చేసి నట్లు కుమారుడే అంగీకరించాడు. డబ్బు కోసం ఎంతవరకు తెగిస్తున్నారో ... బంధాలు... బంధుత్వాలను మరిచి ప్రవర్తిస్తున్నారో... ఇలాంటి ఘటనలు చూ స్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదు అర్థం కాని పరిస్థితి. ఈ ఘటన కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామ శివారులో జరిగింది. ఎస్సై రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బోంరాస్పేట్ మం డలం బిక్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ ధన్ సింగ్ నాయ క్ (68) ఇన్సూరెన్స్ చేయడంతో కొడుకు శ్రీనివాస్ (37) ఇన్సూరెన్స్ డబ్బులపై ఆశతో మంగళవారం ఉద యం 5 గంటలకు హత్య చేసినట్టు తెలిపారు. మృతుడి రెండవ కుమారుడు రవినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య చేసిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.