Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 వేలు ఆర్థికంగా నష్టం
- రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
- తాళ్ళ పల్లి గూడ సర్పంచ్ కుకుడా ల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-మంచాల
గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామును తలగబెట్టారు.ఈ ఘటన బుధవారం రాత్రి మంచాల మండల పరిధిలోని తాళ్ళ పల్లిగూడలో జరిగింది. తాళ్లపల్లిగూడలోని పుర్మ పెంటారెడ్డి గడ్డివామును గుర్తు తెలి యని వ్యక్తులు తగుల బెట్టడం జరిగింది. ఈ విషయం తెలిసిన సర్పంచ్ కుకుడాల శ్రీనివాస్ రెడ్డి గడ్డివామును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడ్డి వామును తగులబడి నష్ట పోయిన ఆ రైతు కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదు కోవాలనీ సర్పంచ్ కోరారు. ఇలా ఆస్తులు తగుల బెట్టి నష్టం చేయడం మంచి పద్ధతి కాద ని పలువురిని హెచ్చరించారు. ముఖ్యంగా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పంచనామా నిర్వహించి, తగులబడిన గడ్డి వాముల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్ట పరిహారం వచ్చే విధంగా చూడాలని తెలిపారు.