Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ లావణ్య శ్రీనివాస్
నవతెలంగాణ-బంట్వారం
మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పనులు చేపట్టినట్టు స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. సీసీరోడ్డు నిర్మాణాలకు సరైన డస్ట్, సీమెంట్, ఇసుక, కంకరల నాణ్యమైన వాటితోనే రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కానీ కొందరు క్షక్షపూరితంగా వ్యవహరిస్తూ నాసిరకంగా నిర్మిస్తున్నామంటూ తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు. మండలంలోనీ అన్ని గ్రామాల కంటే నాణ్యమైన సీసీ రోడ్డు లు మండల కేంద్రంలో నిర్మించడం జరిగిందని, సబంధిత అధికారులు కూడా పరిశీలవచ్చని తెలిపారు.