Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ బీజేపీ నుంచి భారీగా బీఆర్ఎస్లోకి..
- కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
పార్టీ కోసం పనిచేసే పటిష్టమైన కార్యకర్తలతో జిల్లాలో రోజురోజుకూ తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తోందని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు గురు వారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ మండలా ధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వ హయంలో కులమతాల కతీతంగా అందిస్తున్న అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందనీ, అందుకే ప్రజల బీఆర్ఎస్ వైపు ఉన్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పారు. సైనికు లాంటి కార్యకర్తలు ఉన్నందునే, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, విజయం బీఆర్ఎస్దేనని తెలిపారు. రావులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, వార్డు సభ్యులు హజ్రత్ అలీ, సీనియర్ నాయకులు కిషోర్ గౌడ్, సురేష్, శ్రీను, మజ్జు, జహంగీర్, మహేష్, వెంకటేష్ గౌడ్, వారి అనుచరులు మరో 50 మంది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.