Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నర్మద కిష్టప్ప
నవతెలంగాణ-కొడంగల్
బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తానని నర్మద కిష్టప్ప అన్నారు. దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన మహిళలకు, యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన నూతన కమిటీలు నిర్మించి, బలమైన పార్టీగా మార్చడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బాసటగా నిలిచి బహుజన రాజ్యాన్ని సాధించాలని కోరారు. నూతన కమిటీ అధ్యక్షులుగా పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా మాణిక్యప్ప, సెక్రెటరీ నాగిరెడ్డి, సహాయ కార్యదర్శి జనార్ధన్, కన్వీనర్ సేయడం రమేష్, కో-కన్వీనర్ వెంకటేష్, వసంత కుమారిలతో నూతన కమిటీ ఎన్నుకున్నారు.