Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
అవి నీతిలో ఘనుడు ప్రధాన మంత్రి మోడీ అన్ని రోడ్డు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువాసరం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగుటూరు మోకిలా మధ్య ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ తప్పు లేకపోయినా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడకుండా గొంతు నొక్కి వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి లింకు ఏమైనా ఉందేమోనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయని ధీమా వ్యక్తం చేశారు.రూ.3 కోట్లతో చేపడుతున్న టంగుటూరు మోకిలా బ్రిడ్జి రెండు గ్రామాల ప్రజలకే కాకుండా అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీిటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, టంగుటూరు గ్రామ సర్పంచ్ గోపాల్, మోకిలా ఎంపీటీసీ సరిత రాజు నాయక్, మిర్జాగూడ సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాపారావు, కురుమ వెంకటేష్, శంకర్పల్లి సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి ,గోపులారం, మహారాజ్‌పేట్, పిల్లిగుండ్ల ,దొంతంపల్లి, ఇర్రికుంట గ్రామాల సర్పంచులు పొడవు శ్రీనివాస్, దోసాడ నరసిం హారెడ్డి, సత్యనారాయణరెడ్డి, అశ్విని సుధాకర్, సంతోషిని శంకర్ నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కావలి గోపాల్ మున్సిపల్ అధ్యక్షులు అధికారులు ఉన్నారు.