Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మర్చూరి గదిని వెంటనే ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు డిిమాండ్ చేశారు. గురువారం కొడంగల్ ప్రభుత్వాస్పత్రి ఎదుట బాధితుల పక్షాన నిలబడి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టుమార్టం గది లేక పోస్టుమార్టం నిర్వహించాలంటే తాండూర్ తీసుకుపోవాల్సి వస్తుందనీ, త్వరగా మార్చురి భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో 50 పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణం చేపట్టినా సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిబ్బంది కొరత కూడా ఉందనీ, వెంటనే సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానస్పదంగా మృతి చెందితేే పోస్టుమార్టం నిర్వహించాలంటే గదిలేక తాండూరుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పోస్టుమార్టం ఈ ఆస్ప త్రిలోనే నిర్వహించే విధంగా మర్చూరి గదిని మరో 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. లేనియేడలా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.