Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతయుతమైన పార్టీలో పని చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు
- తక్షణమే మాలలకు క్షమాపణ చెప్పాలి
- ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్
నవతెలంగాణ-యాచారం
దళిత కులానికి చెందిన మాలలను అవ మానించే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు ఈసీ శేఖర్ గౌడ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల కిందట జరిగిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడోయాత్ర మీటింగ్లో ఆయన మాలలను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. మాలకులస్తులు సమాజంలో వెలివేయబడ్డ జాతి అంటూ శేఖర్ గౌడ్ మాట్లాడారని తెలిపారు. దీనికి వత్తాసుగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రోత్సహించే విధంగా ఉన్నారని చెప్పారు. ఒక బాధ్యతాయుతమైన పార్టీలో పనిచేస్తూ కింది స్థాయి కులస్తుల పైన శేఖర్ గౌడ్ ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. తక్షణమే ఈసీ శేఖర్ గౌడ్ దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.