Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సమన్వయ సమితి కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గడపగడపకూ చేరవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సమన్వయ సమితి కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ పీసీసీి అధ్యక్షులు పడాల వెంకటస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని దేవుని రవళి గ్రామంలో 'హాత్ సే హాత్ జోడో యాత్ర' కార్యమ్రాన్ని కాంగ్రెస్ చేవెళ్ల మండల అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలకు పెంచి ప్రజల నడ్డీ విరుస్తుందన్నారు. పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేవెళ్లకు నీరందిస్తానని నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దివంగత మాజీ వైఎస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నిలిపివేయడం సరైంది కాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 ఉన్న పింఛన్ ను రెండు వందల పెంచి అందరికీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడిమ్యాల్ పీఎసీఎస్ చైర్మన్ గోనెప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్, భీమ్ భరత్, పీసీసీ కార్యదర్శులు ఉదరు మోహన్ రెడ్డి ,సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు పెంటయ్య గౌడ్, యాలాల మహేశ్వర్ రెడ్డి, రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ , మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, శ్రీరామ్ నగర్ ఎంపీటీసీ సభ్యుడు పట్నం రాంరెడ్డి, మాజీ సర్పంచులు ఇబ్రహీంపల్లి మల్లేష్ యాదవ్, పలుగుట్ట నరసింహులు, న్యాలట బాలయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పలుగుట్ట మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, రామన్నగూడ ప్రభాకర్, ముడిమ్యల శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.