Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి శ్రీను నాయక్
నవతెలంగాణ-షాద్ నగర్
రేపు ఢిల్లీలో జరిగే 'మద్దూర్ కిసాన్ ర్యాలీ' ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి. శ్రీను నాయక్ అన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని, 60 ఏండ్లకు పైబడిన వారందరికీ పింఛన్ ఇవ్వాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు 2022 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి, రోజుకూ రూ. 600 కనీస వేతనం ఇవ్వాలి జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టంలో తీసుకురావాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, వాటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కోరారు.