Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయాందోళనలో గ్రామస్తులు
నవతెలంగాణ-కేశంపేట
గ్రామంలోకి ఒక్క వానరం(కోతి,కొనెంగ) ప్రవేశించిందంటే అది చూసిన ప్రజలు దాన్ని వింతగా చూస్తారు.అదే గుంపులు గుంపులుగా ప్రవేశించి, అరుపులు అరుస్తూ వీధుల గుండా పరిగెత్తుతూ ఒక ఇంటి పైనుండి మరోక్క ఇంటి పైకి గెంతులు వేస్తుంటే, వాటి నుంచి ఎలాం టి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలంతా భయాం దోళ నకు గురవుతున్నారు. ఇలాంటి ఘటననే కేశంపేట మండ లం కాకునూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొనెంగలు గుంపులు గుంపులుగా గ్రామంలోకి ప్రవేశించి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి.ఒక ఇంటి పైనుంచి మరో ఇంటి పైకి గెంతులు వేస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంటి ముంగిట ఉన్న ప్రహరీలపై సంచరిస్తూ, అరుపులతో, కొంటె చేష్టలకు భయాందోళనకు గురైన ప్రజలు ఇంటి తలుపులను మూసివేసి ఇంట్లోనే ఉండి పోతున్నారు. తమ రోజువారి పనులకు వెళ్లేందుకు కూడా ఆటంకం ఏర్పడింది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే చర్యలు చేపట్టి, కొనెంగల భారీ నుంచి కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.