Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్
నవతెలంగాణ- చేవెళ్ల
తాండూరులో లీకైన పదోవ తరగతి ప్రశ్నపత్రం బాధ్యులను వెంటనే సస్పెం డ్ చేసి జైలుకు పంపించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రూప్స్ పేపర్ లీకేజీ మరవక ముందే , పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యా ర్థులు కష్టపడి చదువుతుంటే కొంత మంది ప్రభుత్వా ధికారులు కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో ఆడు కుంటూ పేపర్ లీకులకు పాల్పడుతున్న వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత వహిస్తూ వికారా బాద్ జిల్లా డీఈవో వెంటనే రాజీనామా చేయాలన్నారు. కలెక్టర్ వెంటనే ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట నిర్వహిస్తామని హెచ్చరించారు.