Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త ఎల్. రమణ
నవతెలంగాణ-శంకర్పల్లి
బీఆర్ఎస్ పథకాలు దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి,బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త ఎల్. రమణ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలోని రవీందర్‌రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. భారతదేశంలో బీజేపీ 29 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉండగా అక్కడ తెలంగాణ ఉన్నటువంటి పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదన్నారు. మోడీ హయాంలోనే దేశ సంపద దోపిడీకి గరవుతోందన్నారు. ఇప్పుడు ఆదానీ, అంబానీల ఆస్తులు అధిక రేట్లు పెరిగిపోయని వెల్ల డించారు. బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నల్ల కనెక్షన్, షాదిముబార్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతుబంధు, రైతు బీమా, వికలాంగులకు రూ.3 వేలు, వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ.2 వేల చొప్పన పింఛన్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, తడి పొడి చెత్త, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డ్, కూరగాయల మార్కెట్ వీటి ద్వారా గ్రామాలన్నీ పచ్చగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కసరత్తు చేశారని గుర్తు చేశారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి కుటుంబానికి చేవెళ్ల ఎంతో రుణపడి ఉందన్నారు. రుణపడి ఉందని అన్నారు.ఈ నియోజకవర్గం లోని చందన్‌వెళ్లి గ్రామంలో వెల్సన్ రావడం జరిగిందన్నారు. అదేవిధంగా సీతారాంపురం గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీ కూడా రాబోతోందని చెప్పారు. కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ కూడా వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలందరి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని వెల్లడించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలోనే నీళ్ళు, నిధులు, నియామకాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళలు బిందెలు పట్టుకుని నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారని ఇప్పుడు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకులు ధర్మన్న గారి వెంకటరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్, మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, గోపులారపు సర్పంచ్ శ్రీనివాస్, మహారాజ్‌పేట్ నర్సింహారెడ్డి, ఇరుకుంటా సర్పంచ్ సంతోషిని శంకర్ నాయక్, శంకర్పల్లి సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాపారావు, కురుమ వెంకటేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు రాజు నాయక్, ఎంపీటీసీ సరిత రాజ్‌నాయక్, జన్వాడ ఎంపీటీసీ నాగేందర్, మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫరీద్, బిసి సెల్ అధ్యక్షుడు లింగం ముదిరాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గౌడ్ చర్ల వెంకటేష్, మిర్జాగూడ కిషన్ సింగ్, ప్రవీణ్ కుమార్ గోవర్ధన్ రెడ్డి, ద్రోణాచారి, ప్రవీణ్ కుమార్, చిట్టమ్మ ,శారద, ఒగ్గు అంజయ్య, సుధాకర్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.