Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుట్లలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలి
- మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ సలాం
నవతెలంగాణ-మంచాల
ఆరుట్లలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలనీ మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ సలాం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విచ్ఛలవిడిగా డీజేలు, సౌండ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంతో శబ్ద కాలుష్యం ఎక్కువగా అవుతోందన్నారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులు, గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు కోతుల బెడద, కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు. వ్యర్థ పదార్థాలను చెరువు పక్కన, రోడ్ల పైనే పడేస్తున్నారని తెలిపారు.ఈ సమస్యలతో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పైన తెలిపిన సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య, సాతీరి ఎల్లేష్, సుంకరి ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎన్నుదుల సురేష్ ,ఆమంచ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.