Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ కొందుర్గు మండలాధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తోందని, ఎప్పుడు ఎవ్వరు చేయని అభివృద్ధి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతుందని బీఆర్ఎస్ కొందుర్గు మండల అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలంలోని ఆగిర్యాల నుంచి అయ్యవారిపల్లి గ్రామానికి జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ఎజెండా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.కానీ ప్రతి పక్షాలు పనిచేస్తున్న వారిని విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెంటే మేమందరం ఉంటామని హామీనిచ్చారు. రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, త్వరలో ఆ పనులు త్వరతగతి పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎదిర రామకృష్ణ, వెంకిరాల సర్పంచ్ రాజమొని లింగంగౌడ్, తంగెళ్ళపల్లి ఉప సర్పంచ్ నర్సింలుగౌడ్, బడికెల మహేష్ యాదవ్, రమేష్, పద్మయ్య, అనంతయ్య, గుమ్మడి నర్సయ్య, భీమయ్య, చించోడు నరేష్, గొడుగు నర్సింలు, కృష్ణయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.