Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్ఐ సంపత్ కుమార్
నవతెలంగాణ-గండిపేట్
సైబర్ నేరాల పైన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సైబరా బాద్ ఏఎస్ఐ సంపత్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దపులి కృష్ణ అన్నారు. మంగళవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖానాపూర్ గ్రామంలో సైబర్ నేరాలపై షీటీం కళాబృందంతో ప్రదర్శనలు, పాటల రూ పంలో అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఈ టీజింగ్, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, వేధింపులు, అక్రమ రవాణా బాల్య వివాహాలు, మహిళల భద్రతపై ప్రదర్శన కార్యక్రమాలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. అపరిచితుల నుండి పిల్లల రక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం నిరంజన్గౌడ్, శ్రావణి, హరీష్, కళాబృందం టీం సభ్యులు ప్రమీల, గ్రామస్తులు పాల్గొన్నారు.