Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్‌లో పదో తరగతి పేపర్ బయటకు వచ్చిన కేసు
- పూర్తి విచారణ జరిపిన అధికారులు
- మాల్ ప్రాక్టిస్ చేయించాలనే ఉద్దేశంతోనే పేపర్ బయటకు
- ఇద్దరు ఉపాధ్యాయులకు 14రోజుల రిమాండ్, పరిగి జైల్‌కు తరలింపు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో పదో తరగతి తెలుగు పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన ఘటన లో పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో ఇన్విజిలేటర్ పదవ తరగతి ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన ఈ ఘటన హల్చల్గా మారిన విషయం విధితమే. దీనిపై పూర్తి విచా రణ జరిపిన అధికారులు నిందితులను అరెస్టు చేశారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని ఉన్నత పాఠశాల నంబర్ వన్ లో విధులు నిర్వహిస్తున్న బందప్ప, మరో ఉపాధ్యాయులు సమ్మప్ప ఇద్దరూ స్నేహితులు. వీరు విద్యార్థులతో మాల్ ప్రాక్టీస్ చేయించి అందరిని పాస్ చేయించాలని అనుకు న్నారు. ప్రశ్నాపత్రాన్ని బందప్ప తన ఫోన్లో ఫొటో తీసి అతని స్నేహితుడు సమ్మప్పకు వాట్సప్ ద్వారా పంపించా డు. అదే సమయంలో ఆ పేపర్ న్యూస్ గ్రూపులో కూడా పడిపోయింది. వాట్సప్ ద్వారా వచ్చిన ప్రశ్నాపత్రాన్ని సమప్ప తీసుకొని పట్టణంలోని విద్య జిరాక్స్ సెంటర్‌కు వెళ్ళాడు. జవాబులను స్మాల్ జిరాక్స్ చేస్తున్న క్రమంలో తాండూరులో పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అ యిందని వార్తలు వాట్సప్ గ్రూప్‌లో హల్చల్ అయ్యాయి. దాంతో సమ్మప్ప అక్కడ నుంచి పరారయ్యారు. జిరాక్స్ సెంటర్లు నడిపిస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నాడు. మండల విద్యాధికారి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేసి తాండూర్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇద్దరు ఉపాధ్యాయులకు జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. నిందితులను పరిగి జైల్‌కు తరలించారు.