Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వ సభ్య సమావేశంలో సెల్ ఫోన్లలో గడుపుతున్న అధికారులు
- సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
దోమ మండల సర్వ సభ్య సమావేశం మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యా లయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరై సమావేశం లో చర్చించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు సమావేశా న్ని పట్టించు కోకుండా ఎవరికి వారే తమ సెల్ ఫోన్లలో నిమగ మై సమయం గడిపారు. పంచా యతీ రాజ్ ఏఈ మణికుమార్, నీటిపారుదలశాఖ అధికారి సిద్దార్థ, రోడ్లు భవనాలుశాఖ అధికారి, ఏపీఎం సురేష్, బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, ఐసీ డీఎస్ సూపర్వైజర్లు ఇతర శాఖల చర్చ కొనసాగుతున్న సమయంలో తమ సెల్ ఫోన్లలో చూస్తూ ఉండిపోయారు. గమనించిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమ స్యలపై చర్చ జరుగుతున్నప్పుడు అధికారులు ఫోన్లలో ము నిగి పోవడం పట్ల ప్రజా ప్రతినిధులను అవమాన పర చడమే అంటూ పలువురు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు తమ స్వంత పనులు మానుకు ని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని కోరుతున్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వ యంతో పని చేస్తూ గ్రామ అభివృద్ధికి చేయూత నివ్వాలని ఎమ్మెల్యే కే.మహే ష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ... 'మన ఊరు మన బడి'లో జరిగే కార్యక్రమాలను పూర్తిచేయాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు. బొంప ల్లి అంగన్వాడి కార్యకర్త పోస్టును వెంటనే పూర్తి చేయాలని ఎంపీటీసీ రాములు, సర్పంచ్ కోళ్ల సురేష్ సభాదృష్టికి తీసుకువెళ్లారు. ఏపీఓ దస్తాయ్య పనితీరుపై దోమ సర్పంచ్ రాజిరెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీ టీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, ఎంపీడీఓ జయరాం, ఉపతహసీల్దార్ విజయెందర్, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.